బాలీవుడ్ ఖాన్‌ల త్రయానికున్న స్టామినా టాలీవుడ్‌లో ఒక్క Prabhas కే..

ABN , First Publish Date - 2022-05-22T14:03:48+05:30 IST

ఇండియన్ బాక్సాఫీస్ వందల కోట్లు కొల్లగొట్టగల స్టామినా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ (Salman), షారుఖ్ (Sharukh), ఆమిర్ ఖాన్‌ల (Amir khan)కు ఉంది. ఇప్పుడు అదే స్టామినా మన టాలీవుడ్ స్టార్ ప్రభాస్ (Prabhas)

బాలీవుడ్ ఖాన్‌ల త్రయానికున్న స్టామినా టాలీవుడ్‌లో ఒక్క Prabhas కే..

ఇండియన్ బాక్సాఫీస్ వందల కోట్లు కొల్లగొట్టగల స్టామినా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ (Salman), షారుఖ్ (Sharukh), ఆమిర్ ఖాన్‌ల (Amir khan)కు ఉంది. ఇప్పుడు అదే స్టామినా మన టాలీవుడ్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక్కడికే ఉందని బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఆయన సినిమాలు చెబుతున్నాయి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli) ప్రభాస్‌ను బాహుబలి (Bahubali)గా చూపించిన సిరీస్ చిత్రాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాయి. సౌత్ హీరోలలో అందరికన్నా ముందుగా ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేసి, వసూళ్ళ వర్షం కురిపించిన హీరో ప్రభాస్. 


అసలు పాన్ ఇండియా మార్కెట్ అనేది ఒకటి ఉంది, దాన్ని సౌత్ హీరో కొల్లగొట్టొచ్చు.. అని నిరూపించిన మొదటి స్టార్ మన బాహుబలి ప్రభాస్. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ గ్రాండ్ స్కేల్ మేకింగ్, ప్రభాస్ కటౌట్ అండ్ పర్ఫార్మెన్స్..ఇలా అన్నీ కలిసి బాహుబలి సిరీస్ దాదాపు 2400 కోట్లు రాబట్టేందుకు కారణం అయ్యాయి. అయితే, కొంతమంది యాంటి ప్రభాస్ ఫాన్స్.. అది రాజమౌళి సినిమా కాబట్టే సాధ్యమైందీ.. అని  చాలా సింపుల్‌గా కామెంట్స్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. మరి ప్రభాస్ లేకుండా బాహుబలి అనే క్యారెక్టరే లేదు కదా. ఈ విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.


స్వయంగా రాజమౌళి కూడా ఈ విషయాన్ని చెప్పాడు. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేశాడు. ఫలితం గురించి పక్కన పెడితే, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాడు. మొత్తంగా ప్రభాస్ తన గత నాలుగు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 కోట్ల పైన రాబట్టాడు. పుష్ప (Pushpa)తో అల్లు అర్జున్ (Allu Arjun), కేజీఎఫ్ 2 (KGF 2)తో యష్ (Yash), ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో చరణ్ (Charan) - తారక్ (Tarak) కలిసి దాదాపు 2400 కోట్లను రాబట్టారు. ఆ రకంగా చూస్తే ప్రభాసే నంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో ఆదిపురుష్ (Adipurush), సలార్ (Salaar), ప్రాజెక్ట్ కె (Project K), స్పిరిట్ (Spirit) సినిమాలు ఉన్నాయి. వీటితో డార్లింగ్ రేంజ్ మరో లెవల్‌కు చేరుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.   

Updated Date - 2022-05-22T14:03:48+05:30 IST

Read more