ప్రభాస్‌ సినిమాలో లేను!

ABN , First Publish Date - 2022-05-17T05:44:04+05:30 IST

ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిదుకోనుంది. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ పెట్టారు. కథానాయికగా కియారా అద్వాణీని...

ప్రభాస్‌ సినిమాలో లేను!

ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిదుకోనుంది. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ పెట్టారు. కథానాయికగా కియారా అద్వాణీని ఎంచుకొన్నారని ప్రచారం జరుగుతోంది. సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’లో కైరా నాయిక. దాంతో.. ఆ సెంటిమెంట్‌తోనే తనని మళ్లీ రిపీట్‌ చేస్తున్నారని అనుకొన్నారు. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమాలో కియారా నటించడం లేదు. ఈ విషయాన్ని కియారా సన్నిహితులు స్పష్టం చేశారు. ‘‘కొన్ని రోజులుగా ప్రభాస్‌ సినిమాలో కియారా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఇంత వరకూ కియారాని ఎవరూ సంప్రదించలేదు. కియారా కొత్త సినిమాలు ఒప్పుకొంటే ఆ విషయాన్ని తనే నేరుగా ప్రకటిస్తుంది’’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది కియారా. తెలుగులో తాను చేస్తున్న సినిమా అదొక్కటే. 

Updated Date - 2022-05-17T05:44:04+05:30 IST

Read more