Adipurush: రాముడిగా ప్రభాస్ లుక్ చూశారా..? మామూలుగా లేదుగా..
ABN , First Publish Date - 2022-09-30T14:03:32+05:30 IST
‘బాహుబలి’తో ప్రభాస్ (Prabhas) రేంజ్, స్టార్డమ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకే తెలిసిన ప్రభాస్ ఆ మూవీతో..
‘బాహుబలి’తో ప్రభాస్ (Prabhas) రేంజ్, స్టార్డమ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకే తెలిసిన ప్రభాస్ ఆ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మూవీస్ అన్ని ప్యాన్ ఇండియా చిత్రాలే. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఆది పురుష్(Adipurush)’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్- కె’ వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. అందులో ‘ఆది పురుష్’పై అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా్కి ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు. కృతి సనన్ (Kriti Sanon), సైఫ్అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రలు పోషించారు.
‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు కూడా ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. అభిమానులందరూ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర పడింది. తాజాగా ఆ మూవీలో రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అందులో.. రాముడిగా ప్రభాస్ బాగా సెట్ అయ్యాడు. ఆయన చేతిలో బాణం ఉంది. అంతేకాకుండా.. ఆయన ఆ బాణాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉండగా.. మెరుపులు వస్తున్నాయి. ఆ పోస్ట్‌కి.. ‘యూపీలోని అయోధ్యలో ప్రవహిస్తున్న సరయు నది ఒడ్డున మా అద్భుత యాత్రను ప్రారంభించనున్నాం. మా చిత్రం మొదటి పోస్టర్, టీజర్‌ను అక్టోబర్ 2న రాత్రి 7:11 గంటలకు మాతో కలిసి ఆవిష్కరించండి!. ఆదిపురుష్ జనవరి 12, 2023న IMAX & 3Dలో థియేటర్లలో విడుదల అవుతుంది!’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో.. పలువురు నెటిజన్లు ‘సూపర్’, ‘రికార్డులు బద్దలు అయిపోవాలి’ అని కామెంట్స్ చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.