సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Poonam Kaur: అరుదైన అనారోగ్య సమస్య.. మహారాష్ట్రలో విశ్రాంతి!

ABN, First Publish Date - 2022-12-01T23:56:14+05:30

హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైబ్రో మయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధ పడుతున్న ఆమె ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur)అనారోగ్య సమస్యతో(Health issue) బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైబ్రో మయాల్జియా (Poonam kaur suffring with Fibromyalgia)అనే అరుదైన సమస్యతో బాధ పడుతున్న ఆమె ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి  కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందని సమాచారం. సినిమాల కన్నా సోషల్‌ మీడియాలో ఎక్కువ పాపులర్‌ అయిన పూనమ్‌ రెండేళ్లగా ఈ సమస్యతో బాధ పడుతోందని, ఈ సమస్య నుంచి బయటకు రావడానికి  కేరళలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 

్ఞఅఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్‌ కౌర్‌ నవంబర్‌ 10వ తేదీన మాతో కలిసి సూరత్‌  గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. అక్కడ వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ చికిత్స తీసుకునే క్రమంలో ఫైబ్రో మయాల్జియా నిర్థారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్‌ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పూనమ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత మయోసైటిస్‌ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-12-01T23:56:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!