Pooja Hegde Surgery: సర్జరీ నిజమేనా!

ABN , First Publish Date - 2022-10-03T16:52:22+05:30 IST

తాజాగా పూజాహెగ్డే(Pooja Hegde )కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది.

Pooja Hegde Surgery: సర్జరీ నిజమేనా!

సౌత్‌ సినిమాలో పూజాహెగ్డే(Pooja Hegde Surgery Rumors)కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’ వరుసుగా మూడు చిత్రాలు పరాజయం పాలైనా ఆమె క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. స్టార్‌ హీరోలందరితో అవకాశాలు అందుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ ప్యాన్‌ ఇండియా చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు ప్రత్యేక గీతాల్లో నటించడానికి సై అంటోంది. తాజాగా పూజాహెగ్డే(Pooja Hegde )కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. దాంతో పూజాకు ఏమైంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆమె చేయించుకునేది ముక్కుకు సంబంధించిన సర్జరీ అట. తన అందాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి  సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. దీని కోసమే ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లిందని కొందరు అంటుంటే... సర్జరీ చేయించేసుకుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల విదేశాల్లో విహరిస్తున్న ఫొటోలను షేర్‌ చేయడంతో విదేశాల్లో సర్జరీ అన్న విషయం నిజమే అని భావిస్తున్నారు. అయితే దీనిపై పూజా హెగ్డే టీమ్‌ స్పందించింది. ప్రస్తుతం పూజాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. హాలీడే కోసం ఆమె విదేశాలకు వెళ్లిందని, ఆమె ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె మహేశ్‌ 28, హిందీలో రెండు చిత్రాలతో బిజీగా ఉంది. 

 




Updated Date - 2022-10-03T16:52:22+05:30 IST