Pooja Hegde: పూజ హెగ్డే ఫొటోస్ వైరల్

ABN , First Publish Date - 2022-10-13T23:19:11+05:30 IST

'ఆల వైకుంఠ పురంలో ..' (Ala Vaikuntapuram lo) సినిమాతో పెద్ద హిట్ కొట్టిన పూజ హెగ్డే (Pojja Hegde birthday) పుట్టిన రోజు అక్టోబర్ 13, అంటే ఈరోజు.

Pooja Hegde: పూజ హెగ్డే ఫొటోస్ వైరల్

'ఆల వైకుంఠ పురంలో ..' (Ala Vaikuntapuram lo) సినిమాతో పెద్ద హిట్ కొట్టిన పూజ హెగ్డే (Pojja Hegde birthday) పుట్టిన రోజు అక్టోబర్ 13, అంటే ఈరోజు. ఆమె సల్మాన్ ఖాన్ (Salman Khan), వెంకటేష్ (Venkatesh Daggubati) లతో 'కిసి కా భాయ్ కిసి కా జాన్' (Kisi Ka Bhai Kisi Kaa Jaan) హిందీ సినిమాలో బిజీ గా షూటింగ్ చేస్తోంది. తెలుగులో అగ్ర తారల్లో పూజహెగ్డే వుంది. ప్రస్తుతం ఒక మంచి బ్రేక్ కోసం పూజ చూస్తోంది. 



'ఆల వైకుంఠ పురంలో' తరువాత మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) పక్కన నటిస్తోంది. ఈ సినిమా పెద్ద రేంజ్ లో మళ్ళీ హిట్ అవుతుందని పూజ హెగ్డే భావిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో పూజ ఈ వరం పాల్గొనాల్సి వుండింది, కానీ మహేష్ బాబు తల్లి మరణించటం తో షూటింగ్ వాయిదా పడింది. 


ఈమధ్య అటు హిందీ లో, ఇటు తెలుగులో బాగా రాణిస్తున్న తారల్లో పూజ హెగ్డే ఒకరు. కానీ మంచి సమయం లో హిట్ రాకపోవటం తో కొంచెం నెగటివ్ ఈమె మీద వుంది. అయితే ఆ నెగటివ్ అంత డిసెంబర్ నెలలో పోతుంది అని ఆమె భావిస్తోంది. 


రానున్న డిసెంబర్ నెల  పూజ హెగ్డే కి చాలా కీలకం. ఎందుకంటే ఆమెవి రెండు హిందీ సినిమాలు ఒకే వారం వ్యవధిలో విడుదల అవుతున్నాయి. ఒకటి రణవీర్ సింగ్ కథానాయకుడిగా 'సర్కస్', రెండోది సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వస్తున్న 'కిసి కా భాయ్ కిసి కా జాన్'. ఈ రెండు కూడా డిసెంబర్ నెల లోనే విడుదల అవుతున్నాయి. 


2020 తరువాత నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి, కానీ అందులో ఒకటీ పెద్ద హిట్ కాలేదు. 'ఎఫ్ 3' సినిమాలో  ఒక ఇటీం సాంగ్ చేసింది, కానీ ఆ సినిమా కూడా ఆశించినంత ఆడలేదు. 


ఇప్పుడు పూజ హెగ్డే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొనవసరం లేదు కానీ, ఆమె ఒక బ్రేక్ ఇవ్వ గలిగితే, ఆమె మీద వున్నా ఆ నెగటివ్ పోతుంది. తెలుగు నిర్మాతలు, దర్శకులు చాలా సెంటిమెంట్ వున్నవాళ్లు కాబట్టి ఆమె ఒక విజయం ఇస్తే, మళ్ళీ ఆమెకి కుప్పలు తెప్పలు గా వస్తాయి ఆఫర్స్. అయితే పూజ హెగ్డే ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది అని కూడా ఒక విమర్శా వుంది.


ఫ్యాషన్ అంటే పూజ హెగ్డెన్. ఎందుకంటే ట్రెండీ అవుట్ ఫిట్స్ , వైవిధ్యమయిన బట్టలు వేసుకున్న ఫోటోస్ ఇన్ స్ట లో పోస్ట్ చేస్తూ ఉంటే అవి వైరల్ అవుతూ ఉంటాయి కూడా. ఇవన్నీ, పక్కన పెడితే, ఈరోజు పూజ హెగ్డే పుట్టిన రోజు. ఆమె మంచి విజయాలు సాధించి అగ్రస్థానం లో కొనసాగుతుందని ఆశిద్దాం. 

Updated Date - 2022-10-13T23:19:11+05:30 IST