Pony Verma: ప్రకాష్ రాజ్‌ను పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఒక కారణం

ABN , First Publish Date - 2022-12-08T01:37:31+05:30 IST

హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (Pony Verma). రియలిస్టిక్ నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) కు భార్య.

Pony Verma: ప్రకాష్ రాజ్‌ను పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఒక కారణం

హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (Pony Verma). రియలిస్టిక్ నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) కు భార్య. తాజాగా ‘సలాం వెంకీ’ కి కొరియోగ్రాఫర్‌, అసోసియేట్ డైరెక్టర్‌‌గా పనిచేసింది. అతి త్వరలోనే మెగా ఫోన్ పట్టుకొబోతున్నట్టు చెప్పింది. కొత్తగా కెరీర్‌ను ఆరంభించినట్టు ఉందని పేర్కొంది. ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అనేక ఆసక్తికర విషయాలను అభిమాలనులతో పంచుకుంది. 


‘‘ప్రకాష్ రాజ్ చాలా సహాయకారిగా ఉంటాడు. నేను షూట్‌కు వెళ్తే అతడు ఇంట్లో ఉంటాడు. కుటుంబ సభ్యుల సహకారం కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ముంబైలో పుట్టి, పెరిగినప్పటికి నాకు హైదరాబాదే సొంత ఇల్లు. మా కుమారుడు కూడా ఇక్కడే పాఠశాలకు వెళుతున్నాడు. హైదరాబాద్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. నేను ఇక్కడకు వచ్చి స్థిరపడతానని అస్సలు ఊహించలేదు. నాకు వంట రాదు. ప్రకాష్ రాజ్ అద్భుతంగా వండుతాడు. సాంబార్, ఉప్మా, పొహా రుచికరంగా చేస్తాడు. అతడిని పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఒక కారణం’’ అని పోనీ వర్మ చెప్పింది.   



Updated Date - 2022-12-08T01:37:31+05:30 IST