సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Maniratnam: పీఎస్‌–1 విడుదల తేదీ ఖరారు!

ABN, First Publish Date - 2022-07-02T23:20:34+05:30

1950ల్లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin selvan -1). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాల, జయరామ్‌, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1950ల్లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin selvan -1). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాల, జయరామ్‌, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ‘పి.యస్‌–1’ సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Ponniyin selvan -1 on 10th september)


పదో శతాబ్దానికి చెందిన సాహసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల పొన్నియిన్‌ సెల్వన్‌. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్‌ సెల్వన్‌ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆయన రాజాఽ్యధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు ఈ నవలలో పేర్కొన్నారు. దీని ఆధారంగా ‘పొన్నియన్‌ సెల్వన్‌’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌. (A.R. Rehman music for Ponniyin selvan)


Updated Date - 2022-07-02T23:20:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!