సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాజకీయం నా నుంచి దూరం కాలేదు!

ABN, First Publish Date - 2022-09-21T06:31:44+05:30

చిరంజీవి నుంచి పొలిటికల్‌ డైలాగులు వచ్చి చాలా కాలమైంది. ఎందుకంటే కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి నుంచి పొలిటికల్‌ డైలాగులు వచ్చి చాలా కాలమైంది. ఎందుకంటే కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి టాపిక్‌ వచ్చినా... ఆయన స్పందించడం లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన పొలిటికల్‌ పంచ్‌ వేశారు. ‘‘నేను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ అనే డైలాగ్‌ని ఆయన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఇప్పుడు  ఈ వాయిస్‌ ట్వీట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయింది. చిరు వ్యాఖ్యలు ఎందుకోసం..? ఆయన రాజకీయంగా మళ్లీ బిజీ అవ్వబోతున్నారా? అయితే ఏ పార్టీ నుంచి? అనే ఊహాగానాలు వ్యాపించాయి. చివరికి ఈ ట్వీట్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రమోషన్లలో భాగంగానే అని తేలింది. చిరంజీవి నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాలోని డైలాగునే.. చిరు ట్విట్టర్‌లో వదిలినట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ రాబోతోంది. అందులో ఈ డైలాగ్‌ వినిపించే అవకాశాలున్నాయి.


Updated Date - 2022-09-21T06:31:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!