పొలిటికల్‌ సెటైర్‌ రాజా!

ABN , First Publish Date - 2022-08-23T05:40:59+05:30 IST

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యథా రాజా తథా ప్రజా’. వికాస్‌, శ్రష్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు....

పొలిటికల్‌ సెటైర్‌ రాజా!

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యథా రాజా తథా ప్రజా’. వికాస్‌, శ్రష్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్‌ విట్టల దర్శకుడు. ఆయనతో పాటు హరీశ్‌ పటేల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కథానాయకుడు శర్వానంద్‌ క్లాప్‌నిచ్చారు. ఆయుష్‌ శర్మ స్విచ్చాన్‌ చేశారు. కుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదో పొలిటికల్‌ సెటైర్‌. రాజకీయాలంటే ఆసక్తి లేనివారు ఉండరు. వాళ్లందరికీ నచ్చే వినోదాత్మక చిత్రమిది. కథంతా పూర్తయిన తరవాతే... జానీ మాస్టర్‌ దగ్గరకు వెళ్లాం. కేవలం 20 నిమిషాల్లో ఈ కథని ఆయన ఓకే చేశారు. సెప్టెంబరు 15 నుంచి షూటింగ్‌ మొదలెడతామ’’న్నారు. జానీ మాట్లాడుతూ ‘‘నా సినిమా అంటే.. కచ్చితంగా మంచి స్టెప్పులు ఉంటాయని ఆశిస్తారు. అయితే అన్నింటికంటే కథే ముఖ్యం. అందుకే మంచి కథ కోసం అన్వేషించా. ఈ కథ వినగానే బాగా నచ్చింద’’న్నారు. రథన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్‌ వేలాయుధన్‌ ఛాయాగ్రాహకుడు. 


Updated Date - 2022-08-23T05:40:59+05:30 IST

Read more