సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ante Sundaraniki: మరోసారి పవన్ - నాని రచ్చ చేస్తారా?

ABN, First Publish Date - 2022-06-09T03:45:49+05:30

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుంద‌రానికీ’ (Ante Sundaraniki). నానికి జోడీగా నజ్రీయా ఫహద్ (Nazriya Fahadh) నటించింది. వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుంద‌రానికీ’ (Ante Sundaraniki). నానికి జోడీగా నజ్రీయా ఫహద్ (Nazriya Fahadh) నటించింది. వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న(గురువారం) హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళావేదిక‌లో.. ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ (PowerStar PawanKalyan) గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. 


‘‘సుందర్‌ ప్రసాద్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. అంటే సుందరానికి టీమ్‌ చాలా థ్రిల్‌ అవుతోంది. థ్యాంక్యూ పవన్‌ కళ్యాణ్‌ సర్‌. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు హీరో నాని. ఈ ఈవెంట్‌ను ముందుగా ఈనెల 8న నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్‌గా రావడంతో డేట్‌ మారింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్‌గా వస్తుండటంతో ‘అంటే సుందరానికీ’ సినిమాపై బజ్‌ ఒక్కసారిగా పెరిగింది. అందరి దృష్టి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై పడింది. 


ఎందుకంటే, పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారంటే రాజకీయంగా ఏవైనా కామెంట్లు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆ మధ్య ఏపీలో టికెట్ల సమస్యలో స్పందించిన వారిలో పవన్‌ కళ్యాణ్‌తోపాటు నాని కూడా ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వీరిద్దరూ.. ఒకే స్టేజ్‌ని పంచుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో మళ్లీ వీరు.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఏమైనా మాట్లాడతారా? అనేలా సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చగా చర్చలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-06-09T03:45:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!