POKIRI 4K: ఎవ్వడు కొడితే..!

ABN , First Publish Date - 2022-08-09T02:22:33+05:30 IST

ఈ ఏడాది ‘సర్కారువారి పాట’ చిత్రంతో అలరించిన మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. మహేశ్‌ కెరీర్‌కి మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘పోకిరి’ మరోసారి తెరపై సందడి చేయనుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె ఫార్మెట్‌కి మార్చారు.

POKIRI 4K: ఎవ్వడు కొడితే..!

ఈ ఏడాది ‘సర్కారువారి పాట’ చిత్రంతో అలరించిన మహేశ్‌బాబు (maheshbabu)పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. మహేశ్‌ కెరీర్‌కి మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘పోకిరి’ మరోసారి తెరపై సందడి చేయనుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె ఫార్మెట్‌కి మార్చారు. ఆగస్ట్‌ 9న మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 200 స్ర్కీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా కేరళ, ఓవర్సీస్‌లో కూడా చిత్రాన్ని విడుదల చేస్తునట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలయ్యే అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటికే బుకింగ్స్‌  పూర్తయ్యాయట. (Pokiri 4K movie)




‘పోకిరి’ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు!

1. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు, మహేష్‌ బాబుకు భారీ బ్రేక్‌ ఇచ్చిన సినిమా ఇది. ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై మంజుల, పూరి జగన్నాద్‌ (Puri jaganath)కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్‌ 28, 2006 చిత్రం విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 


2. అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మాఫియా ఆట కట్టించే పాత్రను మహేశ్‌ పోషించారు. ఇలియానా కథానాయిక. 63 రోజుల్లో హైదరాబాద్‌, గోవాలో జరిగిన షూటింగ్‌తో చిత్రం పూర్తయింది.


3. మహేశ్‌ నటన, పాటలు, ఫైటులతోపాటు ఖైరతాబాద్‌ లోకల్‌ ట్రైన్‌లో చిత్రీకరించిన ఫైట్‌ హైలైట్‌గా నిలిచిందని అభిమానులు చెబుతుంటారు. అలాగే పూరి జగన్‌ రాసిన సంభాషణలు మహేశ్‌ నోట బాగా పేలాయి.

 

4. ఒక్కసారి కమిట్‌ అయిఏ నా మాట నేనే వినను. 

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో ఆడే పండుగాడు’ అన్న డైలాగ్‌లకు ఇప్పటికీ వినిపిసుంటాయి.


5. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ ముమైత్‌ఖాన్‌ స్టెప్పులేసిన పాట కుర్రకారును ఉర్రూతలూగించింది. బ్రహ్మానందం, అలీ కామెడీ వినోదాన్ని పంచింది. అలీభాయ్‌గా ప్రకాశ్‌రాజ్‌,  సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పశుపతిగా ఆశిష్‌ విద్యార్ధి విలనీ అలరించింది. 


6. రూ.12 కోట్ల బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం 54 కోట్ల షేర్‌ సాధించింది. 


7. ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూసి హీరో కృష్ణ 40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. కానీ ఆయన అంచనాలను మించి ఈ చిత్రం 54 కోట్లు వసూలు చేయడం విశేషం. 


8. పోకిరి సినిమా చూసి మెగాస్టార్‌ చిరంజీవి మహేశ్‌కు ఫోన్‌ చేసి అభినందిస్తూ గంట సంభాషించారు. 


9. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌కి డిజిటలైజ్‌ చేసి విడుదల చేయడం విశేషం. 


ఇదిలా ఉంటే ఈ చిత్రం స్పెషల్‌ షోస్‌ వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్నారుల గుండె ఆపరేషన్స్‌ కోసం, పేద విద్యార్థుల చదువు కోసం మహేష్‌ బాబు ఫౌండేషన్‌ వారికి విరాళంగా అందించాలని మహేశ్‌ ఫ్యాన్స్‌ డిస్ర్టిబ్యూటర్స్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-08-09T02:22:33+05:30 IST