‘హరిహర వీరమల్లు’: ‘పద్మశ్రీ’ తోట తరణికి పుష్పగుచ్చంతో స్వాగతం

ABN , First Publish Date - 2022-04-08T21:34:55+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ‘ఖుషి’ దర్శకుడు ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రీకరణకు సిద్ధమైంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ సెట్స్‌లో..

‘హరిహర వీరమల్లు’: ‘పద్మశ్రీ’ తోట తరణికి పుష్పగుచ్చంతో స్వాగతం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ‘ఖుషి’ దర్శకుడు ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రీకరణకు సిద్ధమైంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ సెట్స్‌లో సాధన చేస్తున్న ఫొటోలు వైరల్ అయిన నేపథ్యంలో.. తాజాగా కళా దర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణికి ‘హరిహర వీరమల్లు’ టీమ్ గ్రాండ్‌గా స్వాగతం పలికింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తోట తరణి ఈ చిత్రానికి కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ స్పాట్‌కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. ‘‘పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తరణి గారి నేతృత్వంలో ఈ చిత్ర సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి... అధ్యయన అభిలాషకు అద్దంపడతాయని.. చెన్నైలో ఉన్నప్పటి నుండే తరణిగారితో పరిచయం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.Updated Date - 2022-04-08T21:34:55+05:30 IST

Read more