సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jalsa 4k : థియేటర్‌పై పవన్ ఫ్యాన్స్ రాళ్ళదాడి

ABN, First Publish Date - 2022-09-02T17:57:46+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్బంగా.. ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘జల్సా’ (Jalsa) చిత్రం స్పెషల్ షోస్ తో ఫ్యాన్స్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్బంగా.. ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘జల్సా’ (Jalsa) చిత్రం స్పెషల్ షోస్ తో ఫ్యాన్స్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్బంగా ఫ్లెక్సీలు కట్టడం, బ్యానర్స్ కట్టడంతో పాటు .. ‘జల్సా’ షోస్ పడుతున్న థియేటర్స్ కు అభిమానులు పోటెత్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ సినిమా రికార్డులు నెలకొల్పింది. పవన్, త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో తొలి చిత్రంగా ఇలియానా (Ileana) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీవీలో ఎన్నో సార్లు ప్రసారమైనా.. 4కె లో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. 


నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ బర్త్ డే అయితే.. నిన్న కొన్ని థియేటర్స్ లో ‘జల్సా’ చిత్రాన్ని రెండు షోస్ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జల్సా రన్ అవుతోన్న థియేటర్ లో సౌండ్ సిస్టమ్ బాగో లేదంటూ.. పవన్ ఫ్యాన్స్ రాళ్ళదాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలులోని శ్రీరామ్ (Sriram) థియేటర్‌పై ఈ అటాక్ జరగడం గమనార్హం. జల్సా ప్రదర్శిస్తున్న ఆ థియేటర్ లోకి భారీ ఎత్తున తరలివచ్చిన పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోని సౌండ్ సిస్టమ్ అసలు బాగోలేదని ఆందోళన చేపట్టి దాడి చేశారు. దాంతో అక్కడి పోలీసులు తేరుకొని కొందరి బైక్స్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. ఫ్యాన్స్ కు అభిమానం అయితే ఉండొచ్చు కానీ ఇలా థియేటర్‌పై రాళ్ళ దాడి చేసేంత ఉండకూడదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  

Updated Date - 2022-09-02T17:57:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!