విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి Pawan Kalyan క్లాప్..

ABN , First Publish Date - 2022-06-23T19:15:32+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen) ఇటీవలే వచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ఆకట్టుకున్నాడు.

విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి Pawan Kalyan క్లాప్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen) ఇటీవలే వచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ఆకట్టుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి కాస్త వెరైటీ కథలతో సినిమాలు చేస్తూ వస్తున్న విశ్వక్ బాగానే మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం ప్రారంభమయింది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరవడం విశేషం.


విశ్వక్ సేన్ హీరోగా సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా (Arjun Sarja) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. జగపతి బాబు (Jagapathi Babu) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈరోజు చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. 


శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ కోన, లిరిసిస్ట్‌గా చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్‌గా బాలమురుగన్ వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-06-23T19:15:32+05:30 IST

Read more