సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

DP ఛేంజ్.. ట్రెండింగ్‌లో పవర్‌స్టార్

ABN, First Publish Date - 2022-07-08T22:16:30+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ది ట్రూ డెమి గాడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం తమ హీరోని తెరపై చూస్తే చాలు అనుకునే అభిమానులు ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. మాములుగా అయితే ఫాన్స్.. తమ అభిమాన హీరో సినిమాలనే ఫాలో అవుతూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ది ట్రూ డెమి గాడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’. జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం తమ హీరోని తెరపై చూస్తే చాలు అనుకునే అభిమానులు ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. మాములుగా అయితే ఫాన్స్.. తమ అభిమాన హీరో సినిమాలనే ఫాలో అవుతూ ఉంటారు. కానీ పవన్ ఫాన్స్... పవన్ కళ్యాణ్‌నే ఫాలో అవుతారు. అందుకే ఆయనకున్నది అభిమానులు కాదు భక్తులు అంటుంటారు. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా పవన్ కళ్యాణ్ ఫోటో బయటకి వచ్చినా, పవన్ గురించి ఒక టాపిక్ రైజ్ అయినా సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ సునామీ సృస్టిస్తారు. డిజిటల్ మీడియాలో సైతం అత్యధిక ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క పవర్ స్టార్ మాత్రమే.


అందుకే కామన్ DP నుంచి పోల్ అయిన ట్వీట్స్ వరకూ ట్విట్టర్‌లో ప్రతీ రికార్డ్ పవన్ కళ్యాణ్ సొంతం. కేవలం బాక్సాఫీస్ మాత్రమే కాదు సోషల్ మీడియా కూడా మా అడ్డానే అని చెప్పుకునే పవన్ ఫాన్స్ మరోసారి దాన్ని నిజం చేస్తూ... పవర్ స్టార్ అనే ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఒక సినిమా అప్డేట్ లేదు, ఒక పోస్టర్ బయటకి రాలేదు. సడన్ గా ఎందుకు ట్రెండ్ చేస్తున్నారా అని చూస్తే... పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ DP ని చేంజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో జనసేన జెండా ఎగురుతూ ఉంటే, ఆ జండా పొగరు అంతా తన మొహంలో చూపిస్తూ... పవన్ కళ్యాణ్ పెట్టిన ఫోటో అదిరిపోయింది. ఈ ఫోటోని వైరల్ చేస్తూ, పవన్ ఫాన్స్... ట్విట్టర్‌ని షేక్ చేస్తున్నారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) జానపద చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ లోపు పూర్తి చేసి.. తమిళ చిత్రం ‘వినోదయ చిత్తం’ (Vinodaya Chittam) ను రీమేక్ చేసే ఆలోచనతో ఉన్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ దర్శక నిర్మాతలకు కేవలం 20రోజులు సమయాన్ని మాత్రమే కేటాయించారు. ఆలోపు పవన్ పై వచ్చే సన్నివేశాలు షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇందులో పవన్ తో బాటు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) సైతం నటిస్తున్నాడు. సముద్రఖని (Samudra Khani) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో అభిమానుల డెమీగాడ్ అయిన పవన్.. గాడ్ లాంటి పాత్ర చేయబోతున్నారు.  

Updated Date - 2022-07-08T22:16:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!