పండుగాడ్‌.. పట్టుకొంటే కోటి

ABN , First Publish Date - 2022-05-17T05:43:09+05:30 IST

దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో అనసూయా భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’...

పండుగాడ్‌.. పట్టుకొంటే కోటి

దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో అనసూయా భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. ‘పట్టుకొంటే కోటి’ అనేది ఉపశీర్షిక. ఆదివారం అన సూయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను, వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మారెడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఇంకో నాలుగు రోజులు షూటింగ్‌ మిగిలి ఉంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’అన్నారు. ఈ చిత్రంలో సునీల్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనవాస్‌ రెడ్డి, సుడిగాలి సుదీర్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: పి.ఆర్‌, సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల. కథ, స్ర్కీన్‌ప్లే: జనార్ధన మహర్షి.  

Updated Date - 2022-05-17T05:43:09+05:30 IST

Read more