పాన్‌ వరల్డ్‌ సినిమాలు రావాలి

ABN , First Publish Date - 2022-06-01T11:30:41+05:30 IST

‘‘మంచి సినిమాలు ఇవ్వండి.. అని ప్రేక్షకులే డిమాండ్‌ చేయాలి. అందివ్వడానికి చిత్రసీమ సిద్ధంగా ఉంది. మనకు కావల్సింది పాన్‌ ఇండియా సినిమాలు కాదు.. పాన్‌ వరల్డ్‌ సినిమాలు...

పాన్‌ వరల్డ్‌ సినిమాలు రావాలి

‘‘మంచి సినిమాలు ఇవ్వండి.. అని ప్రేక్షకులే డిమాండ్‌ చేయాలి. అందివ్వడానికి చిత్రసీమ సిద్ధంగా ఉంది. మనకు కావల్సింది పాన్‌ ఇండియా సినిమాలు కాదు.. పాన్‌ వరల్డ్‌ సినిమాలు’’ అన్నారు కమల్‌ హాసన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ‘విక్రమ్‌’ కూడా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంద’’ని తెలిపారు. నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఇంత గొప్ప సినిమాని తెలుగులో అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. కమల్‌.. భారతీయ చలన చిత్రానికి గర్వకారణం. ఆయన చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేయలేర’’న్నారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘దశావతారం’లాంటి సినిమా చేయడానికి ఏ నటుడికీ దైర్యం సరిపోదు. ‘ఏక్‌ తూజేకే లియే’తో తొలి పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు. ఇప్పుడు ఆయన గ్లోబల్‌ స్టార్‌.  ఆయనొచ్చాకే దర్శకులు, రచయితలు కొత్తగా ఆలోచించడం మొదలెట్టారు. దశావతారాలు కాదు... శతావతారాలు ఎత్తే ప్రతిభ ఆయనకు ఉంది. కమల్‌కు ఫ్యాన్‌ అంటే నేనే. ఆయన హావభావాలు చదివి, అర్థం చేసుకొని నేను కూడా కొన్ని సినిమాల్లో వాటిని అనుసరించాను. ఆయనతో కలిసి ఓ పూర్తిస్థాయి సినిమా చేయాలని వుంద’’న్నారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ‘‘45 ఏళ్ల క్రితం ఓ డాన్స్‌ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌ వచ్చాను. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, అవన్నీ మంచి విజయాలు అందుకొన్నాయి. నామిత్రుడు వెంకీ నన్ను ఓసారి కలవడానికి గోవా వచ్చారు. ‘నేను సినిమాలు చేస్తున్నాను. హిట్లు వస్తున్నాయి. కానీ సంతృప్తి లేదు. ఏదో కావాలనిపిస్తోంది’ అన్నారు. అప్పుడు నాకు తెలిసిన సలహాలు చెప్పాను. అప్పటి నుంచీ వెంకీ మరో దశలోకి అడగుపెట్టారు. ‘విక్రమ్‌’తో ఓ మంచి ప్రయత్నం చేశాను. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంద’’న్నారు. 



Updated Date - 2022-06-01T11:30:41+05:30 IST