సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pakka Commercial : సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే !

ABN, First Publish Date - 2022-06-28T21:25:33+05:30

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి (Maruthi) తొలి కలయికలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి (Maruthi) తొలి కలయికలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించిన ఈ సినిమాలో రాశీఖన్నా (Rashi Khanna) కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్ర పోషిస్తున్నారు. రావురమేశ్ (Rao Ramesh) విలన్ గా నటిస్తున్నారు. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల ట్రైలర్ ను వదిలారు మేకర్స్. దానికి మంచి స్పందన లభించింది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చిత్రం ఆద్యంతం నవ్విస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక తాజాగా ‘పక్కా కమర్షియల్’ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.


సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే.. మొత్తం 152 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేశారట. అంటే 2 గంట 32 నిమిషాల ప్రదర్శనా సమయం. ‘లౌక్యం’ (Loukyam) తర్వాత గోపీచంద్ నటించిన మరో కామెడీ ఎంటర్ టైనర్ గా విశేషాన్ని సంతరించుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో గోపీచంద్, రాశీఖన్నా ఇద్దరూ లాయర్స్ గా నటిస్తుండగా.. సత్యరాజ్ జడ్జ్ పాత్రలో కనిపించబోతున్నారు. బిఫోర్ లాస్టియర్ ‘ప్రతిరోజూ పండగే’ (Prathiroju Pandage) చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నా మారుతి.. ఈ సినిమాతో ఖచ్చితంగా మరో హిట్ సొంతం చేసుకుంటాడని చెబుతున్నారు. మారుతి తరహా కామెడీ కథాంశానికి , గోపీచంద్ తరహా యాక్షన్ కూడా తోడవడం ఈసినిమా ప్రత్యేకత. మరి ‘పక్కా కమర్షియల్’ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.   

Updated Date - 2022-06-28T21:25:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!