సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prakash Raj సినిమాకు భారీ ఆఫర్

ABN, First Publish Date - 2022-05-14T00:42:42+05:30

స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ‌మార్తాండ’ (Rangamarthanda). ప్రకాష్ రాజ్(Prakash Raj), రమ్య కృష్ణ(Ramya Krishna), బ్రహ్మానందం (Brahmanamdam) కీలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ‌మార్తాండ’ (Rangamarthanda). ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్య కృష్ణ(Ramya Krishna), బ్రహ్మానందం (Brahmanamdam) కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రానికీ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. 


‘రంగమార్తాండ’ డిజిటల్ రైట్స్‌ను రూ. 20కోట్లకు సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చిందట. అయితే, మేకర్స్ ఈ ఆఫర్‌కు అంగీకారం తెలిపారో, లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘నట సామ్రాట్’ అనే మరాఠీ మూవీకీ రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూపొందుతోంది. రంగస్థలం నుంచి రిటైరయిన నటుడి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. నాటకాల నుంచి రిటైర్ అయినప్పటికీ జ్ఞాపకాలను మరిచిపోలేని వ్యక్తి కథను ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. ఈ మూవీకి అభిషేక్ జావ్కర్, మధు కలిపు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘రంగమార్తాండ’ లో శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, తనికెళ్ల భరణి కూడా కనిపించనున్నారు.

Updated Date - 2022-05-14T00:42:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!