సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Aravind: ‘రామాయణం’ అని చెప్పి ‘మహాభారత్’

ABN, First Publish Date - 2022-09-11T02:15:04+05:30

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. కొన్నేళ్ల క్రితం ‘రామాయణం’ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీస్తుకు వస్తామన్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. కొన్నేళ్ల క్రితం ‘రామాయణం’ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీస్తుకు వస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో రామ్ చరణ్, మహేశ్ బాబు తదితరులు రాముడి పాత్రను పోషించనున్నారని పుకార్లు షికార్లు కొట్టాయి. అయితే, ఏమైందో తెలియదు కానీ అల్లు అరవింద్ అకస్మాత్తుగా ‘మహాభారత్’ (Mahabharat) ను తీస్తున్నట్టు ప్రకటించారు. వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు. కొసమెరుపేమిటంటే .. యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) కలల ప్రాజెక్టు కూడా మహాభారతమే కావడం విశేషం.    


అల్లు అరవింద్ తాజాగా అల్లు ఎంటర్ టైన్‌మెంట్స్‌ (Allu Entertainments)ను ప్రారంభించారు. మహా భారత్ ప్రాజెక్టును ఈ సంస్థే నిర్మించనుంది. మధు మంతెన కూడా ఈ వెబ్ సిరీస్‌కు  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామాయణం ప్రాజెక్టును అప్పట్లో వీరిద్దరే ప్రకటించారు.


‘మహా భారత్’ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు తెలుస్తోంది. పోరాటలకు కూడా ప్రాధాన్యం ఉండటంతో విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. 


ఈ ప్రాజెక్టు గురించి ‘డిస్నీ+ హాట్‌స్టార్’ సోషల్ మీడియాలో ఓ మెసేజ్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసం ఇప్పటి వరకు మీరు వీక్షించని రీతిలో కొత్తగా చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యకావ్యం కోసం వేచి ఉండండి. ‘మహాభారత్’ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది’’ అని డిస్నీ+హాట్ స్టార్ ట్వీట్ చేసింది. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.



Updated Date - 2022-09-11T02:15:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!