Ori Devudaa: 'ఓరి దేవుడా కలక్షన్స్ బాగున్నాయి'

ABN , First Publish Date - 2022-10-25T20:30:31+05:30 IST

గత వారం విడుదల అయిన విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' (Vishwak Sen's 'Ori Devuda') సినిమా కలక్షన్స్ చాలా బాగున్నాయని, ఇంకా స్టడీ గానే ఉన్నాయని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశి

Ori Devudaa: 'ఓరి దేవుడా కలక్షన్స్ బాగున్నాయి'

గత వారం విడుదల అయిన విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' (Vishwak Sen's 'Ori Devuda') సినిమా కలక్షన్స్ చాలా బాగున్నాయని, ఇంకా స్టడీ గానే ఉన్నాయని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశి కాకా (Executive producer Vamsi Kaka) చెప్పాడు. నిన్నటికి ఈ సినిమా 7.5 కోట్ల రోపాయల గ్రాస్ (Collected Rs 6 crore gross) కలెక్ట్ చేసిందని, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా చాల స్ట్రాంగ్ గ ఉందని చెప్పాడు వంశి. విశ్వక్ సేన్, మిథిలా పార్కర్ (Mithila Parkar) నడిచిన ఈ టొమాటిక్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా మొదటి రోజున నుండే పాజిటివ్ టాక్ తో నడిచింది. వీకెండ్ కలక్షన్స్ లో 'సర్దార్' (Sardar) తరువాత 'ఓరి దేవుడా' సినిమానే అత్యధికంగా చూసిన వాళ్లలో వున్నారు. 


ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు, అతను చిన్న అతిధి పాత్రలో వచ్చి అందర్నీ మెప్పించాడు. వెంకటేష్ ని పెట్టాలన్న ఐడియా నిర్మాత పివిపి ది అని చెప్తున్నాడు వంశి. (It's producer PVP idea to rope in Venkatesh for the special role) ఇంకెవరిని అనుకోలేదు, ఈ సినిమా చేస్తున్నాం అని అనుకోగానే వెంకటేష్ అయితేనే ఆ ప్రత్యేక పాత్రకి సరిపోతాడు అని వెంటనే పివిపి  వెంకటేష్ తో మాట్లాడటం జరిగిందని చెప్పాడు. వెంకటేష్ కి పివిపి కి వున్న మంచి రిలేషన్ షిప్ వల్ల వెంకటేష్ వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్టు వంశి చెప్పాడు. 

ఈ సినిమా మంచి ప్రాఫిటబుల్ వెంచర్ (Ori Devuda is a profitable venture) అని చెప్తున్నాడు వంశి. ఈ సినిమా ఓ టి టి, సాటిలైట్ హక్కులు (OTT and Satellite rights sold for a big amount) మంచి రేట్ కి అమ్మినట్టు, వాటితోటె సినిమా లాభాలు గడించిందని చెప్పాడు. ఈ థియేట్రికల్ రెవిన్యూ అంత ప్రాఫిట్స్ అని, టీం అంత చాల సంతోషంగా వున్నాం అని చెప్పాడు. ఈ ఉత్సాహంతో రానున్న రోజుల్లో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. అందులో ఒకటి పౌరాణిక సినిమా ఉంటుందని చెప్పాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశి. 

Updated Date - 2022-10-25T20:30:31+05:30 IST