‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ వినోదాత్మకం!
ABN, First Publish Date - 2022-04-19T02:26:43+05:30
ఆరేళ్ల గ్యాప్ తర్వాత కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మెగా ఫోన్ పట్టారు. సోహైల్, అనన్యా జంటగా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, అలీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆరేళ్ల గ్యాప్ తర్వాత కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మెగా ఫోన్ పట్టారు. సోహైల్, అనన్యా జంటగా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, అలీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘చాలాకాలం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మంచి పాత్ర పోషిస్తున్నా. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ అన్నీ ఉన్న చిత్రమిది. కుటుంబ సభ్యులంతా చూసి ఆనందించే ఈ చిత్రం నవ్వులు పూయిస్తుంది’’ అని అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘ఆరేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ‘మీ మార్క్ కామెడీ చిత్రాలు రావడం లేదని అంటున్నారు. మంచి కథతో వస్తున్న చిత్రమిది’’ అని అన్నారు.