సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SSMB28: మహేష్- త్రివిక్రమ్ సినిమాకి పవర్‌ఫుల్ టైటిల్!

ABN, First Publish Date - 2022-09-27T17:08:00+05:30

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Super Star Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘SSMB28’ చిత్రం ఇటీవల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Super Star Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘SSMB28’ చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika and Hassine Creations) సంస్థ  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్. రాధాకృష్ణ (S.Radha Krishna) (చినబాబు China Babu) నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తర్వాత.. సినిమాకి టైటిల్ ఇదంటూ అనేక రూమర్లు వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా షూటింగ్ మొదలైన రోజు మేకర్స్ #SSMB28Aarambham అంటూ ఓ ట్యాగ్‌ని వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ కూడా ఇచ్చేశారని అంతా అనుకున్నారు. ‘ఆరంభం’ (Aarambham) అనేది ఈ చిత్రానికి టైటిల్ కాబట్టే.. అలా ట్యాగ్ చేశారంటూ.. ‘ఆరంభం’ను ట్రెండ్ చేశారు. కానీ మేకర్స్ మాత్రం సైలెంట్‌గా ఎంజాయ్ చేశారు తప్ప.. దానిపై వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు టైటిల్ విషయంలో.. ఓ పవర్ ఫుల్ టైటిల్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.


అటు త్రివిక్రమ్ సెంటిమెంట్, ఇటు మహేష్ బాబు సెంటిమెంట్ కలగలిసేలా ఉన్న ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ పవర్ ఫుల్ టైటిల్ ఏమిటని అనుకుంటున్నారా? ‘అయోధ్యలో అర్జునుడు’ (Ayodhyalo Arjunudu). ఇందులో త్రివిక్రమ్ సెంటిమెంట్ అయినటువంటి మొదటి అక్షరం ‘అ’, మహేష్ బాబు సెంటిమెంట్ అయినటువంటి చివరి అక్షరం ‘డు’ (రాజకుమారుడు, అతడు, ఒక్కడు, దూకుడు, సైనికుడు, ఆగడు, శ్రీమంతుడు) ఉండటంతో.. మ్యాగ్జిమమ్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇంతకుముందు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగిందో తెలియంది కాదు. ఒక టైటిల్‌ని వారే సృష్టించి ఫ్యాన్స్‌లోకి వదలడం.. ఆ టైటిల్‌కి వచ్చిన స్పందనని చూసి.. చివరికి దానిని ఫైనల్ చేయడం అనేది తరుచూ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ టైటిల్ చిత్ర వర్గాల నుండే వచ్చిందని కొందరు అనుకుంటుంటే.. కాదు, సూపర్ స్టార్ ఫ్యాన్స్.. తమ హీరో కోసం సెట్ చేసిన టైటిల్ అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ ట్రెండ్ అవుతోంది. మరి ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారా?.. లేదంటే వేరే టైటిల్‌ని మేకర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి.. టైమ్ కోసం వేచి చూస్తున్నారా? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు.

Updated Date - 2022-09-27T17:08:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!