నితిన్‌ పుట్టినరోజున..

ABN , First Publish Date - 2022-03-28T06:23:07+05:30 IST

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు...

నితిన్‌ పుట్టినరోజున..

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే నితిన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈనెల 30న నితిన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా... టీజర్‌ ని ఆవిష్కరిస్తారు. ‘మాచర్ల’ అనే నియోజక వర్గం నేపథ్యంలో సాగే కథ ఇది. నితిన్‌ కలెక్టర్‌గా కనిపించనున్నారు. సినిమాలో మాస్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయన్న సంగతి ఫస్ట్‌ లుక్‌తోనే అర్థమైపోయింది. టీజర్‌ ఎలా ఉంటుందో చూడాలి. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలుగా నటించిన ఈచిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 


Updated Date - 2022-03-28T06:23:07+05:30 IST