Oke Oka Jeevitham: విడుదల ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2022-08-09T23:52:07+05:30 IST

శర్వానంద్ (Sharwanand), అమల అక్కినేని (Amala Akkineni), రీతూ వర్మ (Ritu Varma) ప్రధాన పాత్రలలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) పతాకంపై రూపొందుతోన్న చిత్రం

Oke Oka Jeevitham: విడుదల ఎప్పుడంటే..?

శర్వానంద్ (Sharwanand), అమల అక్కినేని (Amala Akkineni), రీతూ వర్మ (Ritu Varma) ప్రధాన పాత్రలలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). ఈ సినిమాతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood)లోకి తొలి అడుగు వేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ (Shree Karthick) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ‘మీ అమ్మను చూడాలని ఉందా?’ అనే వాయిస్‌తో మొదలైన ఈ వీడియోలో.. శర్వానంద్ ఎమోషన్స్, హీరోయిన్ రీతూ వర్మ ఎక్స్‌ప్రెషన్స్‌ని పరిచయం చేశారు. చివరిగా సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా తెలిపారు.  


ఈ సందర్భంగా నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు (S R Prakash Babu), ఎస్.ఆర్. ప్రభు (S R Prabhu)  మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో  వీఎఫ్ఎక్స్  సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ చిత్రాన్ని తమిళంలో ‘కణం’ (Kanam) పేరుతో ఏకకాలంలో విడుదల చేయనున్నాం..’’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం సమకూరుస్తుండగా.. సుజిత్ సారంగ్ (Sujith Sarang ) కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 



Updated Date - 2022-08-09T23:52:07+05:30 IST

Read more