ఒకటే కదా జీవితం

ABN , First Publish Date - 2022-08-17T07:06:50+05:30 IST

శర్వానంద్‌ నటించిన 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల కీలక పాత్రధారి...

ఒకటే కదా జీవితం

శర్వానంద్‌ నటించిన 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల కీలక పాత్రధారి. శ్రీకార్తీక్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మాతలు. సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ‘ఒకటే కదా..’ అనే గీతాన్ని విడుదల చేశారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు. కృష్ణకాంత్‌ రాశారు. గౌతమ్‌ భరద్వాజ్‌ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జీవితం విలువ చెప్పే కథ ఇది. మనసుకు హత్తుకొనేలా ఉంటుంది. ఇది వరకు విడుదల చేసిన అమ్మ పాటకు మంచి స్పందన వచ్చింది. తమిళంలో ఈ చిత్రాన్ని ‘కణం’ పేరుతో తీసుకొస్తున్నాం’’అన్నారు.  


Updated Date - 2022-08-17T07:06:50+05:30 IST