సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

DSP: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-11-02T23:53:22+05:30

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ (rockstar devi sri prasad)పై నటి కరాటే కల్యాణి (karate kalyani) ఫైరయింది. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు ఆయనపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ (rockstar devi sri prasad)పై నటి కరాటే కల్యాణి (karate kalyani) ఫైరయింది. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు ఆయనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. టీ సిరీస్‌తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ చేసిన  ‘ఓ పరి’ (O Pari) అనే ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తులతో, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ పాటలోని మంత్రాన్ని వెంటనే తొలిగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా కరాటే కళ్యాణి, హిందు సంఘాలు హెచ్చరించాయి.

Updated Date - 2022-11-02T23:53:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!