సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కర్ణాటక రత్న పురస్కార సభకు ఎన్టీఆర్‌

ABN, First Publish Date - 2022-10-30T09:46:27+05:30

కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం ప్రకటించిన కర్ణాటక రత్న పురస్కార సభకు జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరువుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ హీరో  పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం ప్రకటించిన కర్ణాటక రత్న పురస్కార సభకు  జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరువుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవంబరు ఒకటిన  కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా విధానసౌధలో జరిగే వేడుకలో పునీత్‌రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. . జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించారని వివరించారు. రజనీకాంత్‌ పాల్గొనే విషయం ఇంకా ఖరారు కాలేదన్నారు. కర్ణాటక రత్న పురస్కార సభకు ఈ ఇద్దరు నటులకు మాత్రమే ఆహ్వానాలు పంపామని వెల్లడించారు. 

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)


Updated Date - 2022-10-30T09:46:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!