వైరల్ అవుతోన్న యన్టీఆర్ ఖరీదైన వాచ్

ABN , First Publish Date - 2022-04-08T20:27:27+05:30 IST

తమ అభిమాన హీరోని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు అభిమానులు. వారి కాస్ట్యూమ్స్, వారి కార్లు, వారి స్టైల్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారి అభిరుచులు కూడా అభిమానులకు కొట్టిన పిండి. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సూపర్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న తారక్.. ఇప్పుడు అభిమానులకు ఒక విషయంలో సెంటరాఫ్ ది అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సక్సెస్ పార్టీలో పాల్గొన్న యన్టీఆర్ ఒక ఖరీదైన రిస్ట్ వాచ్‌ను ధరించాడు. అప్పటి నుంచి ఆ వాచ్ మీద అభిమానుల్లో ఒకటే చర్చలు. అత్యంత ఖరీదైన ఈ వాచ్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వాచ్ ధరెంతో తెలుసా? అక్షరాలా కోటి డబ్బై లక్షల పై మాటే.

పటెక్ ఫిలిప్ నాటిలస్ 5712 1 / A ఆ వాచ్ పేరు. ఇంగ్లండ్ కు చెందిన బ్రాండెడ్ వాచ్ అది. గతంలో కూడా యన్టీఆర్ రిచర్డ్ మిల్లేకి చెందిన 011 కార్బన్ యన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ ను ధరించాడు. దీని కాస్ట్ ఇంకా ఎక్కువ. దీని ధర ఏకంగా నాలుగు కోట్లు. ఈ విషయం తెలిసిన అభిమానులు అవాక్కవుతున్నారు. ఇలాంటివి యన్టీఆర్ దగ్గర మరో రెండున్నాయని తెలుస్తోంది. నిజానికి యన్టీఆర్ కు కార్లు, దుస్తులు, వాచెస్ అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటాడు. మార్కెట్లోకి ఏ కొత్త బ్రాండ్ వచ్చినా కళ్లు మూసుకొని ఖరీదు చేసేయడం తారక్  వీక్ నెస్ లాంటి హాబీ. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ తోనే తారక్ ఆ వాచ్ ను కొన్నాడని చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2022-04-08T20:27:27+05:30 IST

Read more