NTR Centenary Award: నటి జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం

ABN , First Publish Date - 2022-11-25T00:30:51+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Aalapati Rajendraprasad) నేతృత్వంలో

NTR Centenary Award: నటి జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Aalapati Rajendraprasad) నేతృత్వంలో సంవత్సర కాలం పాటు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ (NTR) శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. డైలాగ్స్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని.. నటి జయప్రద (Jayaprada)కు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అందించబోతున్నారు. 


ఇక ఈ కార్యక్రమానికి N. జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) ముఖ్య అతిథిగా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి (A Kodandarami Reddy) ఆత్మీయ అతిథిగా వ్యవహరించనున్నారు. వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ శతజయంతి ఉత్సవాలలో భాగంగా.. తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్‌లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చలన చిత్రాలు ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (28/11/2022) ‘అడవి రాముడు’ (Adavi Ramudu) సినిమాను ప్రదర్శిస్తునారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనున్నారు.





Updated Date - 2022-11-25T00:30:51+05:30 IST