అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గదు
ABN , First Publish Date - 2022-05-12T09:43:23+05:30 IST
ఒక్కడు’ సినిమా చూసి దర్శకుడు అవ్వాలని డిసైడయ్యాను. ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేయడం సంతోషంగా ఉంది...

‘రెండున్నరేళ్ల క్రితం ‘సర్కారువారి పాట’ కథ మహేశ్‌బాబుకు చెప్పాను. సినిమా ఫలితం గురించి ఒత్తిడి ఏ కోశానా లేదు. ‘సర్కారు...’విజయంపై అప్పుడు ఎంత ధీమాగా ఉన్నానో ఇప్పుడూ అంతే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని దర్శకుడు పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తిసురేశ్ జంటగా ఆయన రూపొందించిన ఈ చిత్రం నేడు థియేటర్లలో విడులవుతోంది. ఈ సందర్భంగా పరశురామ్ మీడియాతో ముచ్చటించారు.
ఒక్కడు’ సినిమా చూసి దర్శకుడు అవ్వాలని డిసైడయ్యాను. ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ కథ విన్నాక మహేశ్‌బాబు ‘నో’ చెప్పరు అనుకున్నాను. అదే నిజమైంది. కథ వినేటప్పుడే ఆయన బాగా ఎంజాయ్ చేశారు. సెట్‌లో, డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా కష్టపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేశ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాను అనుకున్న విధంగా తీశాను. డబ్బింగ్ చెప్పడం పూర్తయ్యాక మహేశ్ ఫోన్ చేశారు. ‘ఈ రేంజ్ సినిమా అవుతుందను కోలేదు. చాలా బాగుంద’ని ప్రశంసించారు. కథను, నన్ను నమ్మి మహేశ్ ఈ అవకాశం ఇచ్చారు.
‘సర్కారు...’ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేశ్‌బాబు క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఆయన ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ ఇది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గదు. అవుట్ అండ్ అవుట్ ఫన్, మాస్ తరహాలో ఆయన పాత్ర సాగుతుంది. విజువల్‌గా, క్యారెక్టరైజేషన్, మేనరిజమ్ పరంగా ఆయన నటన నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అదిరిపోతుంది.
మహేశ్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మామూలుగా నేను చాలా తక్కువ రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తాను. ప్రతి సీన్‌ను అనుకున్న విధంగా తీయడానికి చాలా టైం పట్టింది. సెట్‌లో మహేశ్ అందరితో కలసిపోయారు. సీన్ చెప్తుంటే ఆయన అలా చేసుకుంటూ వెళ్లిపోయారు. నా విజన్ తెరపైన చూపించడంలో నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్, 14 రీల్స్ అందించిన సహకారం మరువలేనిది.