Singer Noel ఇంట విషాదం!
ABN , First Publish Date - 2022-07-18T18:59:48+05:30 IST
ర్యాప్ సింగర్, నటుడు నోయెల్ (Noel)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శామ్యుల్ శనివారం రాత్రి కన్నుమూశారు. (Tollywood singer) ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
ర్యాప్ సింగర్, నటుడు నోయెల్ (Noel)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి శామ్యుల్ శనివారం రాత్రి కన్నుమూశారు. (Tollywood singer) ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆయన మరణ వార్తలు తెలుసుకున్న తోటి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు గాయనీగాయకులు సంతాపం తెలిపారు. నోయెల్‌కు (Rapper noel)తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఇంట్లో ఆయనతో కలిసి చేసిన అల్లరి వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ర్యాప్ సింగర్‌గానే కాకుండా నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నోయెల్. బిగ్‌బాస్ తెలుగు సీజన్–3లో కంటెస్టెంట్‌గానూ అలరించారు. (Noel father is no more)