నితిన్ - వక్కంతం వంశీ కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం..

ABN , First Publish Date - 2022-04-03T23:32:12+05:30 IST

యూత్ స్టార్ నితిన్, రచయిత - దర్శకుడు వక్కంతం వంశీ కాంబోలో కొత్త చిత్రం తాజాగా ప్రారంభమయింది. 'కిక్', 'రేసుగుర్రం' లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు రచయిగా పనిచేసి

నితిన్ - వక్కంతం వంశీ కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం..

యూత్ స్టార్ నితిన్, రచయిత - దర్శకుడు వక్కంతం వంశీ కాంబోలో కొత్త చిత్రం తాజాగా ప్రారంభమయింది. 'కిక్', 'రేసుగుర్రం' లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు రచయిగా పనిచేసి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా కొత్త సినిమా పూజా కార్యమాలతో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండవ సినిమా. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ వారితో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. కాగా, నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజిక వర్గం' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నితిన్ పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  

Updated Date - 2022-04-03T23:32:12+05:30 IST

Read more