యన్టీఆర్ బావమరిది ‘రాజావారు’ వచ్చేశారు

ABN , First Publish Date - 2022-03-18T23:49:37+05:30 IST

టాలీవుడ్‌లో మరో నటవారసుడు రాబోతున్నాడు. యంగ్ టైగర్ యన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా పేరు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు..

యన్టీఆర్ బావమరిది ‘రాజావారు’ వచ్చేశారు

టాలీవుడ్‌లో మరో నటవారసుడు రాబోతున్నాడు. యంగ్ టైగర్ యన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా పేరు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించారు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని నార్నే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మలయాళ సూపర్ హిట్ ‘తీవండి’ (పొగబండి) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అని వినికిడి. టోవినో థామస్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం మలయాళీలను అమితంగా ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి ధూమపానానికి అలవాటు పడ్డ ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ లో చాలా మార్పులు చేసి  ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాన్ని మలిచినట్టు తెలుస్తోంది. ఇక హోలీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. 


సిగరెట్ ముట్టిస్తూ నితిన్ స్టైల్ గా నడుచుకొని వస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. పూర్తిగా తూర్పుగోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో చిత్రం నిర్మాణం జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కాబోతోంది. నిజానికి దర్శకుడు తేజ.. నితిన్ చంద్రను ‘చిత్రం’ సీక్వెల్ తో లాంఛ్ చేయాలనుకున్నారు. ఎందుకనో అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా చెయిన్ స్మోకర్ గా తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండడం గమనార్హం. మరి ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రం నితిన్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.  



Updated Date - 2022-03-18T23:49:37+05:30 IST