సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’ తాజా అప్‌డేట్ ఇదే!

ABN, First Publish Date - 2022-06-25T00:43:09+05:30

యంగ్ హీరో నితిన్ (Nithiin), కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోహీరోయిన్లుగా.. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో నితిన్ (Nithiin), కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోహీరోయిన్లుగా.. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్ శుక్రవారం అధికారికంగా తెలిపారు. ఈ చిత్రం చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని, మిగిలిన ఆ పాటను త్వరలోనే చిత్రీకరించనున్నామని నిర్మాతలు ప్రకటించారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని.. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కూడా పూర్తయిందని ఈ అప్‌డేట్‌లో మేకర్స్ వెల్లడించారు.


ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), నికితారెడ్డి (Nikitha Reddy) నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్‌లో దూకుడు చూపిస్తూ రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ప్రేక్షకులని అలరిస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్, కృతి శెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. నితిన్, కృతిశెట్టి జోడి చాలా బ్యూటీఫుల్ అండ్ రెఫ్రెషింగ్‌గా వుంది. స్టిల్‌లో కనిపిస్తున్న ఈ పాటని యూరప్ లొకేషన్‌లో చిత్రీకరించారు. కాగా, ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) సంగీతం సమకూరుస్తున్నారు. 

Updated Date - 2022-06-25T00:43:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!