Karthikeya 2: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ABN , First Publish Date - 2022-09-26T21:54:04+05:30 IST
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) టైటిల్‌తో రూపొందింది. చందు మొండేటి
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) టైటిల్‌తో రూపొందింది. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన ఈ చిత్రం అంచనాలను మించి రాణించింది. భారీ వసూళ్లను రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా లాభాలను పంచింది. ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర దించుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.
కార్తికేయ-2 సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘జీ-5’ సొంతం చేసుకుంది. ఈ మూవీ అక్టోబర్ 5 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ‘కార్తికేయ-2’ నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో 1.5మిలియన్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. హిందీ బెల్ట్‌లో ‘కార్తికేయ-2’కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తొలిరోజు 50షోస్‌ను ప్రదర్శించగా, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆ షోస్‌ను క్రమంగా పెంచారు. ఫలితంగా ఐదు రోజుల్లోనే షోస్ సంఖ్య 1575కు చేరింది. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలు ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) లను తట్టుకుని ‘కార్తికేయ-2’ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషం.