సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

18 Pages Trailer: నిజంగానే ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ

ABN, First Publish Date - 2022-12-17T22:09:21+05:30

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా.. ‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) దర్శకత్వంలో..

18 Pages Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా.. ‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు (Bunny Vas) నిర్మాత. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్.. ప్రమోషన్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. మేకర్స్ చెబుతున్నట్లుగా.. నిజంగానే ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ అని అనిపిస్తుంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. అద్భుతమైన విజువల్స్‌తో సరికొత్త అనుభూతిని కలిగించేలా ట్రైలర్ ఉంది. ముఖ్యంగా మరోసారి (కార్తికేయ 2 తర్వాత) నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్‌లో చూపించారు. ‘‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆన్సర్ ఉండకూడదు’’ వంటి డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ నుంచి వస్తున్న మరో అందమైన అద్భుతమైన ప్రేమకథ ఇది అనేలా ఉందీ ఈ చిత్ర ట్రైలర్. ఆయనే ఈ చిత్రానికి కథ అందించారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక డిసెంబర్ 23న వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. (18 Pages Trailer)

Updated Date - 2022-12-17T22:55:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!