Nidhhi Agerwal: వాటిని పట్టించుకోను.. కానీ వారికి మాత్రం సమాధానం చెబుతా..
ABN , First Publish Date - 2022-11-17T15:30:45+05:30 IST
బాలీవుడ్ (Bollywood) మూవీ ‘మున్నా మైఖేల్’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి నిధి అగర్వాల్..
బాలీవుడ్ (Bollywood) మూవీ ‘మున్నా మైఖేల్’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). అనంతరం ఈ ఉత్తరాది భామ నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కి, శింబు ‘ఈశ్వరన్’తో కోలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ గత యేడాది సంక్రాంతికి విడుదలైంది. ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ అమ్మడు గురించి లేక్కలేనన్ని పుకార్లు (Rumours) వచ్చాయి. వీటిని ఆమె పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, ఈ పుకార్లు ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన, వస్తున్న గుసగుసలపై నిధి స్పందించింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘నా మీద వచ్చే పుకార్లకు సంబంధించి ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారే నా తల్లిదండ్రులు. వారికి వివరించిన తర్వాత వీటి గురించి పెద్దగా పట్టించుకోను. ఆలోచించను కూడా. కెరీర్ ఆరంభంలో ఇలాంటి పుకార్లు విన్నపుడు మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది. కాలక్రమంలో అవన్నీ అలవాటైపోయాయి. ఇప్పుడు అలాంటి వార్తలు వినే సమయం, పట్టించుకునే పరిస్థితి లేదు’ అని నిధి అగర్వాల్ స్పష్టం చేసింది.. కాగా, ఈమె నటించిన ‘కలగ తలైవన్’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఇందులో హీరోగా ఉదయనిధి స్టాలిన్ నటించాడు.