సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Annapurna Studios : దేశంలోనే తొలిసారిగా.. సరికొత్త టెక్నాలజీ

ABN, First Publish Date - 2022-05-23T17:57:33+05:30

ఒక సినిమా తీయాలంటే.. సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్స్ వెతుక్కోవాలి. దేశాలు దాటి షూటింగ్ చేయాల్సి వస్తుంది. వీసా, విమానటిక్కెట్లు, అకామడేషన్, షూటింగ్ సామగ్రి.. ఇలా నిర్మాతకి బోలెడంత ఖర్చు. తీరా లొకేషన్‌కు వెళ్ళాకా వాతావరణం బాగోకపోతే ఆరోజు షూటింగ్ బంద్. ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక సినిమా తీయాలంటే.. సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్స్ వెతుక్కోవాలి. దేశాలు దాటి షూటింగ్ చేయాల్సి వస్తుంది. వీసా, విమానటిక్కెట్లు, అకామడేషన్, షూటింగ్ సామగ్రి.. ఇలా నిర్మాతకి బోలెడంత ఖర్చు. తీరా లొకేషన్‌కు వెళ్ళాకా వాతావరణం బాగోకపోతే ఆరోజు షూటింగ్ బంద్. ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా. ఈ సమస్యలకు చెక్ పెట్టే అత్యాధునిక సాంకేతికతే వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ (Virtual Production Technology). ఈ సాంకేతికతతో ఒక చిన్న గదిలో మొత్తం షూటింగ్‌ను కానిచ్చేయొచ్చు.  పినిమా ప్రపంచంలో ఈ సరికొత్త టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios) లో ప్రారంభిస్తున్నారు. అక్టోబర్‌లో షూటింగ్స్ ప్రారంభం కానుండడం విశేషం. 


హిమాలయాల సీన్ తీయాలంటే.. హిమాలయాల వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద తెరపై హిమాలయాల బ్యాక్ గ్రౌండ్ కనిపించేలా చేసి.. దాని ముందు నటిస్తే చాలు. సినిమాలో చూస్తే నిజంగానే హిమాలయాల్లో తీసినట్టు ఉంటుందా సీన్. దాన్ని సుసాధ్యం చేసేదే వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ (Virtual Production Technology). ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ .. ఇప్పడు భారతీయ సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ సాంకేతికతతో కూడిన వేదికను అన్నపూర్ణా స్టూడియోస్ (Annapurna Studios) లో ఏర్పాటు చేయబోతున్నారు. లొకేషన్, స్పేస్, బడ్జెట్ పరిమితులకు లోబడి రాసుకున్న కథను సినిమాగా, వెబ్ సిరీస్ గా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆన్ లొకేషన్ ప్రొడక్షన్ ఖర్చుల్ని తగ్గించి, మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకూ ప్రత్యక్షంగా చూడగలిగే, సమయం, డబ్బును ఆదాచేసే టెక్నాలజీ ఇది అని చెబుతున్నారు. మరి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. నిర్మాతలకు పండగే. 

Updated Date - 2022-05-23T17:57:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!