Ap Tickets: టికెట్‌ తెగితే.. సర్కారు ఖాతాలో 2 శాతం జమ కావాల్సిందే!

ABN , First Publish Date - 2022-06-04T05:08:04+05:30 IST

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే(online ticketing) విక్రయాలు జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ మేరకు ప్రభుత్వమే సినిమా టిక్కెట్లను అమ్మాలని ఓ చట్టం చేసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే టికెట్ల అమ్మకాల జరుపుతామనీ, థియేటర్‌లలో అమ్మడానికి వీలులేదని కొత్త జీవోను తెచ్చారు.

Ap Tickets: టికెట్‌ తెగితే.. సర్కారు ఖాతాలో 2 శాతం జమ కావాల్సిందే!

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే(online ticketing) విక్రయాలు జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ మేరకు ప్రభుత్వమే సినిమా టిక్కెట్లను అమ్మాలని ఓ చట్టం చేసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే టికెట్ల అమ్మకాలు జరుపుతామనీ, థియేటర్‌లలో అమ్మడానికి  వీలులేదని కొత్త జీవోను తెచ్చారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ ఏర్పాటు చేసేందుకు టెండర్లకు కూడా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అల్లు అరవింద్‌ కుమారుడు అల్లు బాబీకి (allu bobby) చెందిన ఓ సంస్థకు ఈ కాంట్రాక్‌ దక్కిందని, ఎల్‌1 ఆ సంస్థే ఉందని ప్రచారం సాగింది. అయితే రెండుమూడు నెలలుగా ఈ విషయం పక్కకు వెళ్లిపోయింది. 

తాజాగా ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ గురించి కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ఆన్‌లైన్‌ బుకింగ్‌ సంస్థల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని ఆ జీవోలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రతి టిక్కెట్‌పై ప్రభుత్వానికి రెండు శాతం కమీషన్‌ ఇవ్వాలని ఆదేశించారని సమాచారం. దీనితోపాటు మరికొన్ని నిబంధనలు ఉన్నాయి. థియేటర్ల వద్ద టిక్కెట్లు అమ్మరాదని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ థియేటర్ల వద్ద టిక్కెట్లు అమ్మినా ఆన్‌ లైన్‌ పద్దతిలోనే అమ్మాల్సి ఉంటుంది. టికెట్‌ ఏజెన్సీ సంస్థలు మాత్రమే టికెట్‌ అమ్మాలి. అలా చేయడం వల్ల గేట్‌వే చార్జీలు, ప్రభుత్వ కమిషన్‌ అన్నీ కలిపి ప్రేక్షకుడే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం  స్పెషల్‌గా ఒక పోర్టల్‌ ఏర్పాటు చేసి 2 శాతం కమిషన్‌ (2 % commission) తీసుకోవడం ఒక పద్దతి. బుక్‌ మై షో లాంటి పోర్టల్స్‌ ద్వారా టికెట్‌ కొన్నా.. ప్రభుత్వానికి రెండు శాతం చెల్లించాలని నిబంధన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. దీనిని బట్టి ఆంధ్రాలో సినిమా టికెట్‌ కొంటే అందులో రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సిందే! 

Updated Date - 2022-06-04T05:08:04+05:30 IST