God father teaser: తమన్‌పై మండి పడుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-08-23T00:01:40+05:30 IST

తమన్‌ (Thaman)సంగీతం అందించిన ప్రతి సినిమాకు ట్రోలింగ్‌ తప్పడం లేదు. కాపీ క్యాట్‌ అని తరచూ గుర్తు చేసినా తమన్‌ తీరులో మార్పులేదు. తాజాగా ఆయన నెట్టింట ట్రోలింగ్‌ కావడానికి కారణం.. చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘గాడ్‌ ఫాదర్‌’ (God father)టీజర్‌.

God father teaser: తమన్‌పై మండి పడుతున్న నెటిజన్లు

తమన్‌ (Thaman)సంగీతం అందించిన ప్రతి సినిమాకు ట్రోలింగ్‌ తప్పడం లేదు. కాపీ క్యాట్‌ అని తరచూ గుర్తు చేసినా తమన్‌ తీరులో మార్పులేదు. తాజాగా ఆయన నెట్టింట ట్రోలింగ్‌ కావడానికి కారణం.. చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘గాడ్‌ ఫాదర్‌’ (God father)టీజర్‌. ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా (Mohan raja)దర్శకుడు. మాతృకకు పలు మార్చులు చేర్పులు చేసి చిరు నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలను జోడించి కథను తీర్చిదద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. అయితే చిరంజీవి లుక్స్‌, టీజర్‌లో డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో ఉందీ టీజర్‌. అలాగే ఇదే సినిమాకు సంబంధించి మరో విషయంలో కూడా ట్రెండింగ్‌లో ఉందీ సినిమా. 


ఈ మధ్యకాలంలో తమన్‌ సంగీతం అందించిన చిత్రంలో ఏదో ఒక పాట కాపీ కొట్టినట్లు అనిపించినా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చి ఆ మచ్చను తుడిచేస్తున్నాడు తమన్‌. కానీ గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌కు సంబంధించి నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇందులో బీజీఎమ్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘గని’ థీమ్‌లా ఉందనీ, అదే థీమ్‌ను ఉన్నది ఉన్నట్లు దించేశాడని ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇలా కాపీ చేయకుండా ప్రత్యేకమైన నేపథ్య సంగీతం ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు, అభిమానులు తమన్‌పై మండిపడుతున్నారు. 

Updated Date - 2022-08-23T00:01:40+05:30 IST

Read more