Garikapati Controversy: గరికపాటి వారు ఇలా అని ఉంటే.. ఏ గొడవా ఉండేది కాదు

ABN , First Publish Date - 2022-10-07T20:24:19+05:30 IST

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఆధ్వర్యంలో.. ఆయన కుమార్తె విజయలక్ష్మీ..

Garikapati Controversy: గరికపాటి వారు ఇలా అని ఉంటే.. ఏ గొడవా ఉండేది కాదు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఆధ్వర్యంలో.. ఆయన కుమార్తె విజయలక్ష్మీ ‘అలయ్‌ బలయ్’ (Alai Balai) కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సమాజంలోని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత.. స్టేజ్‌పై గరికపాటివారు ప్రవచనం మొదలెడుతూ.. చిరంజీవిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా గరికపాటి నరసింహారావు‌పై బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది.


అసలేం జరిగిందంటే..

ఈ కార్యక్రమంలో గరికపాటివారు ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు (Chiranjeevi Photos) దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం అసహనానికి గురిచేసింది. దీంతో ఆయన ‘‘అక్కడ ఫొటోల సెషన్ ఆపితేనే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవిగారు దయచేసి మీరు ఆ ఫొటోసెషన్ ఆపి ఈ పక్కకు రండి. చిరంజీవిగారికి ఇది నా విజ్ఞప్తి.. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి’’ అంటూ లేచి వెళ్లిపోబోయారు. ఆ తర్వాత వెంటనే చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి.. గరికపాటివారి పక్కన కూర్చుని ప్రవచనాలు విన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటిని మెగాభిమానులే కాకుండా కొందరు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా ఈ వివాదం రచ్చ రచ్చ అవుతుంది. 


గరికపాటివారు ఇలా అని ఉంటే..

అయితే ఈ నెటిజన్లలోనే కొందరు.. ‘‘గరికిపాటి వారు జ్ఞానులు. మరి వారికి తట్టలేదేమో కానీ.. ఆయన అలా అని ఉండాల్సింది కాదు. మీరు ఆ ఫొటోస్ ఆపాలమ్మ, అది ఆపేస్తే ఆయన రావడానికి వీలు అవుతుంది.. ప్రోగ్రాం సవ్యంగా సాగిపోతుంది.. అని అక్కడవారికి చెబితే చాలా గౌరవంగా ఉండేది. ఇంత గొడవ కూడా జరిగేది కాదు. చిరంజీవి మాత్రం ఈ విషయంలో చాలా పెద్దరికంగా వ్యవహరించారు. మెగాస్టార్ అని అనిపించుకున్నారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్‌ని అందరూ లైక్ చేస్తున్నారు.

Updated Date - 2022-10-07T20:24:19+05:30 IST