ఫ్లోరిడాలో సమంత పాట.. ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2022-03-27T05:30:00+05:30 IST

‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాటొచ్చి నాలుగు నెలలు అవుతోంది. అయినా క్రేజ్‌ తగ్గలేదు. ఆ పాటలో సమంత వేసిన స్టెప్పులు అంతగా ప్రేక్షకుల్ని కట్టిపడేసాయి. పాట విడుదలయ్యాక ఎంత వివాదం అయిందో.. అంతకుమించి సంచలనం సృష్టించి యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. అది దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన మ్యాజిక్‌. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుందీ పాట.

ఫ్లోరిడాలో సమంత పాట.. ట్వీట్ వైరల్

‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాటొచ్చి నాలుగు నెలలు అవుతోంది. అయినా క్రేజ్‌ తగ్గలేదు. ఆ పాటలో సమంత వేసిన స్టెప్పులు అంతగా ప్రేక్షకుల్ని కట్టిపడేసాయి. పాట విడుదలయ్యాక ఎంత వివాదం అయిందో.. అంతకుమించి సంచలనం సృష్టించి యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. అది దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన మ్యాజిక్‌. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుందీ పాట. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రతి మార్చిలో ‘అల్ర్టా మయామి’ పేరుతో గ్రాండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో 'ఊ అంటావా.. మావ’ పాటను ప్రదర్శించారు. ఆ వీడియో సమంత సోషల్ మీడియాలో షేర్ చేసారు.  'మా సినిమాకు చాలా గొప్ప రీచ్‌ ఇది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టాటస్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇదే వీడియోను ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసి..పాన్‌ ఇండియానా బొక్కనా.. ‘పుష్ప’ అంతకు మించి పాన్‌ వరల్డ్‌ స్థాయికి చేరిపోయింది' అని ట్వీట్ చేసారు. సమంత ఆ ట్వీట్ ను  రీట్వీట్‌ చేసి ఇది నిజమేనా? అని ప్రశ్నించింది.  



Updated Date - 2022-03-27T05:30:00+05:30 IST