Neha Shetty: ‘బెదురులంక’లో.. బార్బీ బొమ్మ కాదు బాంబ్!

ABN , First Publish Date - 2022-12-06T01:58:14+05:30 IST

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్..

Neha Shetty: ‘బెదురులంక’లో.. బార్బీ బొమ్మ కాదు బాంబ్!

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం క్లాక్స్ (Clax) దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. ఈ చిత్రంలో హీరో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రయూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. ‘‘సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ... లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ... అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ, నేహా కాంబినేషన్.. వాళ్ళిద్దరి సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు.  


చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘‘మా హీరోయిన్ నేహా శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో ఆమె రోల్ చాలా బాగుంటుంది. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వినోదాత్మక చిత్రమిది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి’’ అని తెలిపారు. (Neha Shetty First Look from Bedurulanka 2012) 



Updated Date - 2022-12-06T01:58:14+05:30 IST