NCPCR: ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో బాలలకు ప్రత్యేక రక్షణ!

ABN , First Publish Date - 2022-06-26T20:54:00+05:30 IST

వినోద రంగంలో బాలల హక్కులను రక్షించేందుకు జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. టీవీ షోలు, సీరియళ్లు, వార్తలు, సమాచార మాధ్యమాలు, సినిమా, ఓటీటీ సోషల్‌ మీడియా ప్రకటనలతోపాటు అన్ని వాణిజ్య, వినోద రంగాల్లో పనిచేేస బాలలు అందరికీ వర్తించేలా ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది.

NCPCR: ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో బాలలకు ప్రత్యేక రక్షణ!

వినోద రంగంలో బాలల హక్కులను రక్షించేందుకు జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. టీవీ షోలు, సీరియళ్లు, వార్తలు, సమాచార మాధ్యమాలు, సినిమా, ఓటీటీ సోషల్‌ మీడియా ప్రకటనలతోపాటు అన్ని వాణిజ్య, వినోద రంగాల్లో పనిచేేస బాలలు అందరికీ వర్తించేలా ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది.  బాలల హక్కుల రక్షణకు చాలా చట్టాలు ఉన్నా పెద్దవాళ్ల ఆదిపత్యంతో వినోదరంగంలోని బాలనటుల కోసం ప్రత్యేక నిబంధనలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియమించిన కమిటీ 2011లో ఇచ్చిన మార్గదర్శకాలను మార్పులు చేస్తూ వచ్చారు. తుది ముసాయిదాలో ఏం చెప్పారంటే.. (NCPCR)


పిల్లలను షూటింగ్‌కు తీసుకెళ్లే ముందు జిల్లా మేజిరేస్టట్‌ అనుమతి తీసుకోవాలి. వారిని దూషించడం, పీడించడం లాంటివి చేయకుండా ఉంటామని హామీ ఇవ్వాలి. షూటింగ్‌ సమయంలో చిన్నారులు శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. పిల్ల్ల చదువులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. చిత్రీకరణ ఉన్న సమయంలో వారికి ప్రైవేటు ట్యూటర్‌ను ఏర్పాటు చేయాలి. 


వరుసగా 27 రోజులు పని చేయకూడదు. రోజుకి ఒక షిఫ్టు మాత్రమే పనిచేయాలి. మూడు గంటలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి. చిన్నారుల ఆదాయంలో 20% మొత్తాన్ని వారి మైనారిటీ తీరాక వారికి అందేలా జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. శారీరక, మానసిన పురోగతిపై ప్రభావం చూపే పాత్రలను చిన్నారులకు ఇవ్వకుండా చూసుకోవాలి. మద్యం, ధూమపానం, అసాంఘిక కార్యకలాపాలు ఉన్న సన్నివేశాలకు అనుమతి ఇవ్వకూడదు. దుస్తులు మార్చుకోవడానికి వారికి ప్రత్యేక గదులు కేటాయించాలి. షూటింగ్‌ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. చర్మానికి హాని కలిగించే లైట్లు, హానికారమైన మేకప్‌ కిట్‌లను ఉపయోగించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. జైలు శిక్షతోపాటు జరిమానాలు ఉంటాయి.


Updated Date - 2022-06-26T20:54:00+05:30 IST