రెగ్యులర్‌ షూటింగ్‌లో ఎన్‌సి 22

ABN , First Publish Date - 2022-09-21T06:29:55+05:30 IST

అక్కినేని నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపొందే చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది...

రెగ్యులర్‌ షూటింగ్‌లో ఎన్‌సి 22

అక్కినేని నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపొందే చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘ఎన్‌సి 22’ అనే వర్కింగ్‌ టైటిల్‌లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ‘అక్కినేని నాగేశ్వరరావుగారి దివ్య ఆశీస్సులతో నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మేం నిర్మించే చిత్రం గురించి అద్భుతమైన అప్‌డేట్‌ ప్రకటిస్తున్నాం’ అని నాగచైతన్య కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.  తెలుగు, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తండ్రీకొడుకులైన సంగీత దర్శకులు ఇళయరాజా. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. వారిద్దరూ కలసి పనిచేస్తున్న తొలి  సినిమా ఇదే. ఈ చిత్రానికి రచన: అబ్బూరి రవి, సమర్పణ: పవన్‌కుమార్‌, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి.


Updated Date - 2022-09-21T06:29:55+05:30 IST