ante sundaraanikee : ఆకట్టుకుంటోన్న నజ్రియానజీం లుక్

ABN , First Publish Date - 2022-03-17T22:12:41+05:30 IST

నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ వినోదాత్మక చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ మూవీతో నానీ బ్రాహ్మణ యువకుడిగా నవ్వులు పూయించబోతున్నాడు. నానీ పుట్టినరోజు నాడు విడుదలైన బర్త్ డే హోమం వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఒక ఛాదస్తపు బ్రాహ్మణ యువకుడికి, ఒక క్రిస్టియన్ యువతికి మధ్య ప్రేమకథే ఈ సినిమా. ఇందులో కథానాయికగా మలయాళ బ్యూటీ, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నటిస్తోంది.. ఇందులో ఆమె మిస్ లీలా థామస్ అనే ఫోటో గ్రాఫర్‌ గా సుందరం మనసుదోచే అమ్మాయిగా అదరగొట్టబోతోంది. నేడు (గురువారం) చిత్ర బృందం నజ్రియా పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు.

ante sundaraanikee : ఆకట్టుకుంటోన్న నజ్రియానజీం  లుక్

నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ వినోదాత్మక చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ మూవీతో నానీ బ్రాహ్మణ యువకుడిగా నవ్వులు పూయించబోతున్నాడు. నానీ పుట్టినరోజు నాడు విడుదలైన బర్త్ డే హోమం వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఒక ఛాదస్తపు బ్రాహ్మణ యువకుడికి, ఒక క్రిస్టియన్ యువతికి మధ్య ప్రేమకథే ఈ సినిమా. ఇందులో కథానాయికగా మలయాళ బ్యూటీ, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నటిస్తోంది. మిస్ లీలా థామస్ అనే ఫోటో గ్రాఫర్‌ గా సుందరం మనసుదోచే అమ్మాయిగా అదరగొట్టబోతోంది. నేడు (గురువారం) చిత్ర బృందం నజ్రియా పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. 


కలల సముద్రంలో విహరించే ఫోటో గ్రాఫర్ మిస్ లీలా థామస్ గా మెరుపు తీగ నజ్రియా నజీమ్ ను పరిచయం చేస్తున్నాం.. అలాగే ఆమెకి హ్యాపీ హోలీ ఆమెన్  అని విషెస్ చెప్పారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. గతంతో ఆర్య, నయనతార జంటగా నటించిన అట్లీ.. ‘రాజు రాణి’ లో ముఖ్య పాత్ర పోషించిన నజ్రియా నజీమ్ తెలుగులో ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయం అవుతోంది.  మరి ఈ సినిమాతో ఆమె తెలుగులో  ఏ స్థాయిలో అవకాశాలు అందుకుంటుందో చూడాలి. 



Updated Date - 2022-03-17T22:12:41+05:30 IST