‘జెంటిల్‌మేన్-2’: కన్ఫ్యూజ్ చేసిన నయనతార
ABN , First Publish Date - 2022-03-24T22:25:51+05:30 IST
ప్రస్తుతం దక్షిణాదిలో నయనతార అగ్రహీరోయిన్‌గా కొన సాగుతూ లేడీ సూపర్‌స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇపుడు వెండితెరకు నయనతార పేరుతో మరో నటి పరిచయమవుతోంది. క్రియేటివ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రానికి
ప్రస్తుతం దక్షిణాదిలో నయనతార అగ్రహీరోయిన్‌గా కొన సాగుతూ లేడీ సూపర్‌స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇపుడు వెండితెరకు నయనతార పేరుతో మరో నటి పరిచయమవుతోంది. క్రియేటివ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రానికి ఇపుడు సీక్వెల్ రానుంది. ఎంఎం. కీరవాణి సంగీతం సమకూర్చే ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార చక్రవర్తి అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కేటీ కుంజుమోన్ తన ట్విటర్లో వెల్లడించారు. అలాగే, మరో హీరోయిన్ కూడా నటిస్తారని ఆమె పేరును కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. అయితే నయనతార పేరు వినగానే అంతా కన్ఫ్యూజ్ అయ్యారు.
ప్రస్తుతం అగ్ర హీరోయిన్గా ఉన్న నయనతార పేరు పక్కన చక్రవర్తి పేరు ఏంటబ్బా.. అని అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నయనతార పేరు పక్కన ఉంటే తండ్రి కురియన్ పేరు, లేదంటే ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకున్న విఘ్నేష్ శివన్ పేరు ఉండాలి. కానీ చక్రవర్తి అని ఉండటంతో అంతా షాకయ్యారు. కానీ ఈ నయనతార.. ఆ నయనతార కాదని నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అంతా కూల్ అయ్యారు. అసలిదంతా ఎందుకంటే.. ‘జెంటిల్‌మేన్’కి సీక్వెల్ అనగానే ఖచ్చితంగా స్టార్ హీరోహీరోయిన్లే నటిస్తారని అంతా అనుకోవడం సహజమే. కానీ నిర్మాత కొత్త హీరోయిన్ని తీసుకోవడం వెనుక కారణం ఏమిటనేది తెలియరాలేదు. అయితే ఇంకో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని చెబుతున్నారు కాబట్టి.. ఈ నయనతార సెకండ్ హీరోయిన్గా చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా.. చక్రవర్తి రూపంలో ఈ నయనతార కన్ఫ్యూజ్ చేసిందన్నది మాత్రం వాస్తవం.