సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మళ్ళీ షూటింగ్స్‌తో బిజీ అవుతోన్న Nayanathara

ABN, First Publish Date - 2022-06-28T18:30:18+05:30

ఈ నెల 9న సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara), తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan).. మహాబలిపురంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో వారి పరిణయం కన్నుల పండుగగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 9న సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara), తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan).. మహాబలిపురంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో వారి పరిణయం కన్నుల పండుగగా జరిగింది. వీరి పెళ్ళి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్ళితో ఒకటవడంతో అభిమానులు ఆనంద పరవశులయ్యారు. అయితే పెళ్ళయిన 20 రోజులకే నయనతార మళ్ళీ తన షూటింగ్స్‌తో బిజీ అవడం ఆశ్చర్యం అనిపించకమానదు. నిజానికి ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ అందమైన ప్రదేశంలో తమ హనీమూన్‌ను జరుపుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. 


అయితే .. నయనతారకు సినిమాల పరంగా బోలెడన్ని కమిట్‌మెంట్స్ ఉండడంతో కేవలం హనీమూన్‌కు వారు అతి తక్కువ సమయాన్ని కేటాయించి తమ స్వస్థలానికి తిరిగి వచ్చారట. తాజాగా నయనతార షారుఖ్ ఖాన్ (Sharukh Khan), అట్లీ (Atlee) కలయికలోని చిత్రం ‘జవాన్’ (Jawan) షూటింగ్ లో జాయిన్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో నయనతార ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అందులో ఒక పాత్ర జవాన్ అని వినికిడి. ఈ సినిమాను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Red Chillies Entertainments) బ్యానర్‌పై నిర్మాణం జరుపుకుంటోంది.  రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇంకా ప్రియమణి, యోగిబాబు, సన్య మల్హోత్రా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 


నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రంలోనూ, ‘కనెక్ట్’ (Connect) అనే తమిళ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఎప్పుడో పూర్తయింది. ఇంకా మరికొన్ని చిత్రాలకు నయనతార అంగీకారాన్ని తెలిపింది. పెళ్ళయిన తర్వాత నయన్ సినిమాలను తగ్గించేస్తుందని ఆందోళన చెందిన అభిమానులకు ఈ వార్త ఊరటనిస్తోంది. మరి ‘జవాన్’ చిత్రం నయనతారకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-28T18:30:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!